News September 29, 2024

ఆ మాజీ మంత్రి తిరిగి క్యాబినెట్‌లోకి

image

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ముఖ్య‌మంత్రి స్టాలిన్ తిరిగి త‌న క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై 15 నెల‌ల‌పాటు జైలులో ఉన్న సెంథిల్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఇక ఉద‌య‌నిధి స్టాలిన్‌కు DyCMగా ప్ర‌మోష‌న్ ద‌క్కిన విషయం తెలిసిందే. అలాగే క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరో ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులు ఆదివారం మ‌ధ్నాహ్నం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

Similar News

News September 29, 2024

మీ పిల్లల్ని Sportsలో జాయిన్ చేశారా!

image

విద్యార్థుల చ‌దువులను మెరుగుప‌ర‌చ‌డంలో క్రీడలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రీడ‌ల వ‌ల్ల వారిలో ఆలోచన, అభ్యాస సామర్థ్యాలు, టీమ్‌వర్క్-కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు వంటి సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే స‌మ‌య‌పాల‌న‌-క్ర‌మ‌శిక్షణ‌తో కూడిన న‌డ‌వ‌డిక‌, ఏకాగ్ర‌తను పెంచి ఒత్తిడిని త‌గ్గిస్తాయ‌ని, త‌ద్వారా వారి చదువులు మెరుగుప‌డ‌తాయ‌ని పేర్కొంటున్నారు.

News September 29, 2024

చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి

image

AP: తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని YCPనేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులు ఎందుకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు? శ్రీవారికి అపచారం జరిగితే PSలో కంప్లైంట్ ఇచ్చి ఊరుకుంటారా? వేంకటేశ్వరస్వామిపై మీ భక్తి ఇదేనా? వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్’ అని ఆయన ఆరోపించారు.

News September 29, 2024

RRB క్లర్క్ మెయిన్స్ Admit Cards విడుదల

image

RRB క్లర్క్ మెయిన్స్ Admit Cards 2024ను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ <>ibps.in<<>> నుంచి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదే రోజున మెయిన్స్ పరీక్ష జ‌ర‌గ‌నుంది.