News September 29, 2024
HYD: పింక్ పవర్ రన్.. పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 3కే, 5కే, 10కే పింక్ పవర్ రన్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
Similar News
News November 4, 2025
బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.
News November 4, 2025
సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.


