News September 29, 2024

విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే

image

అక్టోబర్ 3 నుంచి 21 వరకు (11, 12 తేదీలు మినహాయించి) జిల్లాలో టెక్ పరీక్ష జరగనుంది. కలువరాయి, చింతలవలస, కొండకారకం, గాజులరేగ, జొన్నాడ కేంద్రాలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మరల 2.30 నుంచి సాయంత్రం 5 వరకు అన్ లైన్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు హాజరయ్యేవారు గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు.

Similar News

News September 29, 2024

100 జిల్లాల్లో విజయనగరానికి స్థానం

image

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ జ‌న్ జాతీయ ఉన్న‌త్ గ్రామ్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి అక్టోబ‌రు 2న ఆన్‌లైన్ వర్చువల్‌గా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆదివారం తెలిపారు. ఆదిమ గిరిజ‌న తెగ‌ల వారు నివ‌సించే దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. అందులో విజ‌య‌న‌గ‌రం జిల్లా కూడా ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

విజయనగరం: ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు(39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఎన్.ఏం.ఆర్‌గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.