News September 29, 2024
ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్‌కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.
Similar News
News February 27, 2026
కడప: హిస్టరీ పేపర్-1 పరీక్షకు 89% మంది విద్యార్థులు హాజరు

కడప జిల్లాలో శుక్రవారం 43 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ హిస్టరీ పేపర్-1 పరీక్షలు జరిగాయి. 2,144 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,912 మంది 89% హాజరయ్యారు. 232 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 809 మందికి గాను.. 725 మంది పరీక్షలు రాశారు. 84 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,335 మందికి గాను.. 1,187 మంది హాజరవ్వగా, 148 మంది గైర్హాజరయ్యారు.2 చోట్ల మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు.
News February 27, 2026
ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.
News February 26, 2026
కడప జిల్లాలో ఆహార తనిఖీకి సిబ్బంది ఎక్కడ?

కడప జిల్లా పుడ్ సేప్టీ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో హరిత ఒక్కరే ఉన్నారు. ఈమెకు సహాయంగా అసిస్టెంట్ పుడ్ కంట్రోల్ అధికారి రామచంద్రన్ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే జిల్లా అంతటా ఆహార నాణ్యత తనిఖీలు, శాంపిల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. ఫీల్డ్ స్టాప్ కొరతతో తనిఖీలు చేయలేకపోతున్నామన్నారు.


