News September 29, 2024
IPL: బీసీసీఐ మరో కీలక నిర్ణయం?
IPL 2025 మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్లేయర్ల కంటే విదేశీ ప్లేయర్ల ధర ఎక్కువగా ఉండకూడదనే రూల్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు 2025 మెగా వేలంలో ఓ ఇండియన్ ప్లేయర్ రూ.18 కోట్ల ధర పలికితే 2026 వేలంలో ఓ విదేశీ ఆటగాడికి అంతకుమించి ధర పలకకూడదని తెలుస్తోంది. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను 2027 వరకు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 22, 2024
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ
వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
News December 22, 2024
భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్
భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.
News December 22, 2024
టోల్ వసూలు చేస్తూనే ఉంటామంటే కుదరదు: సుప్రీం
ఇష్టమొచ్చినంత కాలం టోల్ వసూలు చేసుకోవడం నిరంకుశత్వమేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘టోల్ వసూలు శాశ్వతం కాదు. ప్రాజెక్టులనేవి ప్రజల కోసమే తప్ప ప్రైవేటు సంస్థల లాభార్జన కోసం కాదు. ప్రజలపై అన్యాయంగా భారం మోపడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. ఢిల్లీ-నోయిడా ఫ్లైవే టోల్ రుసుము ఒప్పందాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని నిర్మాణ సంస్థ సుప్రీంలో సవాలు చేయగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.