News September 29, 2024
సండే స్పెషల్: సిక్కోలు కళారూపం ‘తప్పెటగుళ్లు’

శ్రీకాకుళం జిల్లా యాదవులు కళారూపంగా “తప్పెటగుళ్లకు” ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తప్పెటగుళ్ల సంప్రదాయ నాగరికతను పూర్వీకులు నుంచి కొనసాగిస్తున్నారు. యాదవ కుటుంబాలకు పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం జీవనాధారం. పశుగ్రాసం కష్టతరమైన సమయంలో దైవానుగ్రహం కోసం తప్పెటగుళ్లతో పూజలు చేస్తారు. ఇక పండగలు, గావు సంబరాల్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది.
Similar News
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.
News November 8, 2025
SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎంఅండ్హెచ్ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.
News November 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు


