News September 29, 2024

మీ పిల్లల్ని Sportsలో జాయిన్ చేశారా!

image

విద్యార్థుల చ‌దువులను మెరుగుప‌ర‌చ‌డంలో క్రీడలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రీడ‌ల వ‌ల్ల వారిలో ఆలోచన, అభ్యాస సామర్థ్యాలు, టీమ్‌వర్క్-కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు వంటి సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే స‌మ‌య‌పాల‌న‌-క్ర‌మ‌శిక్షణ‌తో కూడిన న‌డ‌వ‌డిక‌, ఏకాగ్ర‌తను పెంచి ఒత్తిడిని త‌గ్గిస్తాయ‌ని, త‌ద్వారా వారి చదువులు మెరుగుప‌డ‌తాయ‌ని పేర్కొంటున్నారు.

Similar News

News September 29, 2024

రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ

image

AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News September 29, 2024

హెజ్బొల్లాకు మరో భారీ ఎదురుదెబ్బ?

image

హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లా టాప్ కమాండర్ నబీల్ క్వాక్‌ను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చినట్లు సమాచారం. కాగా నబీల్ 1995 నుంచి 2010 వరకు హెజ్బొల్లా మిలిటరీ కమాండర్‌గా పని చేశారు. 2020లో అతడిని US ఉగ్రవాదిగా గుర్తించింది. కాగా నిన్న బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాతోపాటు ఆయన కుమార్తె కూడా మరణించిన సంగతి తెలిసిందే.

News September 29, 2024

రాజమౌళితో సినిమా చేయాలనే ఆశ ఉంది: అశ్వనీదత్

image

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘జక్కన్న తొలి చిత్రం స్టూడెంట్ నం.1కు నేను ప్రజెంటర్‌గా వ్యవహరించా. మొదటి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది’ అని తెలిపారు.