News September 29, 2024

IPL: ఆటగాళ్ల రిటెన్షన్‌పై ‘జియో సినిమా’ అంచనా.. మీరేమంటారు?

image

వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌పై స్పష్టత రావడంతో జట్లు ఎవరిని అంటిపెట్టుకుంటాయనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే RCB, MI, CSK, SRH రిటెన్షన్ ఆటగాళ్లను జియో సినిమా అంచనా వేసింది.
MI: రోహిత్, సూర్య, హార్దిక్, బుమ్రా‌, తిలక్ వర్మ, ఇషాన్‌
RCB: కోహ్లీ, పాటిదార్, గ్రీన్, సిరాజ్‌
CSK: ధోనీ, రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, దేశ్‌పాండే
SRH: కమిన్స్‌, హెడ్, అభిషేక్, క్లాసెన్, భువీ, నితీశ్‌

Similar News

News January 30, 2026

TG EAPCET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ ఈఏపీ సెట్-2026(గతంలో ఎంసెట్) షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేనెల 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News January 30, 2026

‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ& రేటింగ్

image

కన్నవాళ్లు విధించిన కట్టుబాట్లు, భర్త(తరుణ్ భాస్కర్) చూపించే పురాషాహంకారాన్ని ఎదిరించి ప్రశాంతి(ఈషా రెబ్బ) జీవితంలో ఎలా నిలదొక్కుకుంది అనేదే కథ. తరుణ్, ఈషా నటన మెప్పిస్తుంది. కొన్ని సీన్లు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో డైరెక్టర్ AR సజీవ్ తడబడినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, కామెడీ సీన్లు ఒరిజినల్ మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ తరహాలో వర్కౌట్ కాలేదన్న భావన కలుగుతుంది.
రేటింగ్: 2.25/5

News January 30, 2026

కారు ఇంటి వద్ద ఉన్నా టోల్.. ఇదే కారణం!

image

దేశవ్యాప్తంగా FASTag వ్యవస్థలో లోపాలు గుర్తించినట్లు LSలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ‘2025లో 17.7లక్షల వాహనాలకు తప్పుగా టోల్ వసూలైంది. ఇంటి వద్ద ఉన్న కార్లకూ ఛార్జీ పడినట్లు మెసేజ్‌లు వెళ్లాయి. టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు మాన్యువల్ ఎంట్రీ కారణంగా ఈ తప్పిదాలు జరిగాయి. 17.7లక్షల కేసులకు సంబంధించి NHAI టోల్ డబ్బులు తిరిగి చెల్లించింది’ అని వివరించారు.