News September 29, 2024
CPM తాత్కాలిక సమన్వయకర్తగా ప్రకాశ్ కారత్

సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నాయకుడు ప్రకాశ్ కారత్ వ్యవహరించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మధురై వేదికగా సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిని ఈ మహాసభల సందర్భంగా ఎన్నుకోనున్నారు.
Similar News
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
News November 7, 2025
PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్‌లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.


