News September 29, 2024
కొత్త NCA ప్రత్యేకతలు ఇవే

బెంగళూరులో సకల సౌకర్యాలతో బీసీసీఐ కొత్త ఎన్‌సీఏను రూపొందించింది. దాదాపు 40 ఎకరాల్లో 3 మైదానాలు సిద్ధం చేశారు. వీటిలో ఇన్‌డోర్, ఔట్‌డోర్ కలిపి ఏకంగా 86 పిచ్‌లు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్‌పూల్, 80 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, స్పా, స్టీమ్ బాత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఫిజియోథెరపీ జిమ్, స్పోర్ట్స్, సైన్స్, మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభిస్తారు.
Similar News
News February 2, 2026
HYDలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్ @318

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 2, 2026
పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
News February 2, 2026
స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.


