News September 29, 2024

రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ

image

AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News September 29, 2024

రాత్రి ఆటో ఎక్కిన మహిళా ఏసీపీ.. తర్వాతేమైందంటే..

image

సుకన్య శర్మ ఆగ్రాలో ఏసీపీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత ఎలా ఉందో చూసేందుకు స్వయంగా రాత్రివేళ రంగంలోకి దిగారు. ముందుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు. వారు సక్రమంగా రెస్పాండ్ అవుతున్నట్లు గుర్తించారు. అనంతరం సామాన్యురాలిలా ఓ ఆటో ఎక్కారు. సదరు డ్రైవర్ ఆమె చెప్పిన చోట క్షేమంగా దించాడు. మహిళల భద్రతా పరిశీలన కోసం ఆమె ఇలా స్వయంగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

News September 29, 2024

టికెట్ లేకున్నా శ్రీవారిని దర్శించుకోండిలా..!

image

కొంతమందికి అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. సాధారణంగా 2, 3 నెలల ముందే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోనివారి కోసం TTD గత కొన్నేళ్లుగా టైమ్ స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) విధానాన్ని అమలు చేస్తోంది. రోజూ ఉదయం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు ఇస్తారు. వీటిని తీసుకొని ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లొచ్చు.

News September 29, 2024

రేపు మ.2 గంటలకు ‘రా మచ్చా మచ్చా’

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్- కియారా జంటగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ రిలీజ్‌పై మరో అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొంపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. నిన్న విడుదలైన ప్రోమోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.