News September 29, 2024

RCB ఆ ఒకర్ని తప్ప అందర్నీ వదిలేయాలి: ఆర్పీ సింగ్

image

ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రెష్‌గా రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. విరాట్‌ను తప్ప అందర్నీ వదిలేయాలన్నారు. ‘కోహ్లీ జట్టుతోనే ఉండాలి. అతడి చుట్టూ టీమ్ నిర్మించాలి. మిగిలిన కీలక ఆటగాళ్లను RTMతో సొంతం చేసుకుంటే చాలు. సిరాజ్, పాటీదార్ వంటి కీలక ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయొచ్చు. ఆ జట్టులో ఇప్పుడున్న వారిలో విరాట్ తప్ప వేరెవ్వరూ రూ. 14-18 కోట్లు పలికే ఛాన్స్ లేదు’ అని తెలిపారు.

Similar News

News September 29, 2024

‘ఆదిపురుష్‌’పై ట్రోలింగ్ వల్ల ఏడ్చాను: రచయిత

image

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ మూవీపై నెట్టింట జరిగిన ట్రోలింగ్ సినిమా టీమ్ అందర్నీ ప్రభావితం చేసిందని గేయ, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ తెలిపారు. ‘ట్రోలింగ్‌తో ఏడ్చాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. తిరిగి నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News September 29, 2024

రాత్రి ఆటో ఎక్కిన మహిళా ఏసీపీ.. తర్వాతేమైందంటే..

image

సుకన్య శర్మ ఆగ్రాలో ఏసీపీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత ఎలా ఉందో చూసేందుకు స్వయంగా రాత్రివేళ రంగంలోకి దిగారు. ముందుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు. వారు సక్రమంగా రెస్పాండ్ అవుతున్నట్లు గుర్తించారు. అనంతరం సామాన్యురాలిలా ఓ ఆటో ఎక్కారు. సదరు డ్రైవర్ ఆమె చెప్పిన చోట క్షేమంగా దించాడు. మహిళల భద్రతా పరిశీలన కోసం ఆమె ఇలా స్వయంగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

News September 29, 2024

టికెట్ లేకున్నా శ్రీవారిని దర్శించుకోండిలా..!

image

కొంతమందికి అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. సాధారణంగా 2, 3 నెలల ముందే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోనివారి కోసం TTD గత కొన్నేళ్లుగా టైమ్ స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) విధానాన్ని అమలు చేస్తోంది. రోజూ ఉదయం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు ఇస్తారు. వీటిని తీసుకొని ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లొచ్చు.