News September 29, 2024

ALERT: మరికాసేపట్లో భారీ వర్షం

image

TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అత్తాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవనున్నట్లు అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.

Similar News

News October 18, 2025

ఊరిస్తున్న రికార్డులు.. కోహ్లీ అందుకుంటాడా?

image

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత AUS సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
*మరో 54 runs: ODIల్లో అత్యధిక రన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్‌.
*68 runs: లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ల (ODI, T20)లో ఫస్ట్ ప్లేస్‌కు. సచిన్ (18,436) తొలి స్థానంలో ఉన్నారు.
*సెంచరీ: ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(సచిన్-51), ఆసియా వెలుపల ఎక్కువ సెంచరీలు చేసిన Asian బ్యాటర్‌గా (సచిన్-29) రికార్డు

News October 18, 2025

ప్రశాంతమైన నిద్ర కోసం టిప్స్

image

*రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందనేది అపోహే. మొదట్లో మత్తుగా ఉన్నా, ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది.
*రాత్రి పడుకోవడానికి గంట ముందు పాలు తాగాలి. అవకాడో, అరటి తినాలి.
*వెలుతురు లేని గదిలో పడుకోవాలి. బెడ్ లైట్ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
>నిద్ర సరిగా లేకుంటే దీర్ఘకాలంలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News October 18, 2025

5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

image

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.