News September 29, 2024
రాజ్యసభ రేసులో నాగబాబు?

AP: ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లూ NDAకే దక్కనున్నాయి. వీటిలో 2 TDP, ఒకటి JSP పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. TDP నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. BJP అధిష్ఠానం తమకూ ఓ సీటు అడగొచ్చని సమాచారం.
Similar News
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.
News January 15, 2026
NTVపై చర్యలకు కారణం ఇదేనా?

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.


