News September 29, 2024

వీరోచితం: చనిపోయే ముందు ఉగ్రవాదిని అంతం చేశాడు!

image

తాను చనిపోయే స్థితిలో ఉన్నా కనీసం ఒక్క ఉగ్రవాదినైనా వెంట తీసుకుపోవాలనుకున్నారాయన. తూటా దెబ్బకి ఒళ్లంతా రక్తమోడుతున్నా ఓ ముష్కరుడిని హతమార్చాకే కన్నుమూశారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్‌దీ వీరగాథ. మండ్లీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవీరుడైన బషీర్‌కు రాష్ట్ర పోలీసు శాఖ ఘన నివాళులర్పించింది.

Similar News

News September 30, 2024

ఇదే అత్యంత ఖరీదైన వస్తువు!

image

మనిషి ఇప్పటి వరకూ లెక్కలేనన్ని వస్తువుల్ని తయారుచేశాడు. కానీ వాటన్నింటిలోకెల్లా అత్యంత ఖరీదైన వస్తువు ఏది? గిన్నిస్ బుక్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే అత్యంత ఖరీదైన మానవ నిర్మిత వస్తువు. 2011లో నిర్మాణం పూర్తి చేసుకున్న దాని విలువ రూ.12.55 లక్షల కోట్ల పైమాటే. భూకక్ష్యలో వ్యోమగాములు ఉండేందుకు ఇది ఓ ఇల్లులా ఉపకరిస్తోంది. మొత్తం 14 దేశాలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.

News September 30, 2024

ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్‌పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

image

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి రాష్ట్రాలు, UTలకు కేంద్రం లేఖ రాసింది. 70 ఏళ్లు, ఆ పైబడిన వారందరికీ ఈ పథక ప్రయోజనాలు కల్పించేందుకు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని సూచించింది. ఇందుకోసం ఆయుష్మాన్ యాప్, వెబ్‌సైట్‌ Beneficiary.nha.gov.inలో సదుపాయం కల్పించినట్లు పేర్కొంది. త్వరలోనే పథకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ స్కీమ్‌తో ₹5లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందొచ్చు.

News September 30, 2024

ఫిట్‌నెస్ లేకపోతే జట్టు నుంచి తీసేస్తాం: పాక్ క్రికెట్ బోర్డు

image

సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు పాక్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఫిట్‌నెస్ ప్రమాణాలు పాటించని వారిని జట్టు నుంచి తప్పిస్తామని తేల్చిచెప్పింది. ఇటీవల నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో పలువురు విఫలమయ్యారు. సోమవారం మరోసారి పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీబీ తమ ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఫిట్‌నెస్ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.