News September 30, 2024
అదానీ గ్రూప్‌నకు థాంక్స్: ప్రజ్ఞానంద

తన గెలుపు వెనుక అదానీ గ్రూప్ ఇచ్చిన మద్దతు చాలా ఉందని చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నేను నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ అండగా నిలవడంతో అది సాధ్యమైంది. ఈ ఏడాది మొదట్లో నేను గౌతమ్ అదానీని కలిశాను. భారత్‌కోసం లక్ష్యం చేరాలని ఆయన సూచించారు. ఆయన ఇస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞుడిని’ అని తెలిపారు.
Similar News
News January 28, 2026
మా క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోంది: భట్టి

TG: ప్రజాభవన్‌లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఫైరయ్యారు. సీఎం రేవంత్ దేశంలో లేనందున మున్సిపల్ ఎన్నికలపై తనకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. మంత్రులు వారి సమస్యలు తెలియజేశారని, ఆ విషయాలను CMకు వివరించానని చెప్పారు. తమ క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని మధిరలో ధీమా వ్యక్తం చేశారు.
News January 28, 2026
విమాన ప్రమాదంపై డీజీసీఏ కీలక ప్రకటన

మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై DGCA వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. పైలట్ల నుంచి మేడే కాల్(సాయం కోరడం) రాలేదని వెల్లడించింది. రన్‌వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బందిపడ్డారని తెలిపింది. ‘ఇది టేబుల్ టాప్ రన్‌వే(ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండే). తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. రెండోసారి చేసిన ల్యాండింగ్ ప్రయత్నం విఫలమై కుప్పకూలింది’ అని వివరించాయి.
News January 28, 2026
మేడారం చేరుకోండిలా!

మేడారం మహాజాతర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకునేందుకు RTC ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. రైల్వేశాఖ కూడా వరంగల్, ఖాజీపేట వరకూ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. అక్కడి నుంచి బస్సులుంటాయి. HYD నుంచి సొంత వాహనాల్లో వెళ్లేవారు WGL హైవే మీదుగా గూడెప్పాడ్ X రోడ్, కటాక్షపూర్, ములుగు, పస్రా నుంచి మేడారం చేరుకోవచ్చు. ఏటూరునాగారం నుంచి తాడ్వాయి X రోడ్డు ద్వారా తల్లుల గద్దెల వద్దకు వెళ్లొచ్చు.


