News September 30, 2024
సంగారెడ్డిలో హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కూల్చివేతల పేరుతో నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని అధికారులకు సూచించారు. ‘హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకే పరిమితమని CM చెప్పారు. ORR బయట ఏవైనా సమస్యలుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి’ అని అధికారులను ఉద్దేశించి ప్రెస్మీట్లో మాట్లాడారు.
Similar News
News January 2, 2026
బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఏది?

2025లో టాలీవుడ్ నుంచి ‘OG’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మినహా ఏ సినిమా రూ.300Cr+ కలెక్ట్ చేయలేదు. ధురంధర్, చావా, కాంతార: ఛాప్టర్-1 వంటి ఇతర భాషల సినిమాలు రూ.700cr+ రాబట్టాయి. దీంతో ఈ ఏడాది రిలీజయ్యే టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాక్సాఫీసు వద్ద ఏ మేరకు రాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’, NTR ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ లిస్టులో ఉన్నాయి.
News January 2, 2026
టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 2, 2026
అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.


