News September 30, 2024
ఇదే అత్యంత ఖరీదైన వస్తువు!

మనిషి ఇప్పటి వరకూ లెక్కలేనన్ని వస్తువుల్ని తయారుచేశాడు. కానీ వాటన్నింటిలోకెల్లా అత్యంత ఖరీదైన వస్తువు ఏది? గిన్నిస్ బుక్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే అత్యంత ఖరీదైన మానవ నిర్మిత వస్తువు. 2011లో నిర్మాణం పూర్తి చేసుకున్న దాని విలువ రూ.12.55 లక్షల కోట్ల పైమాటే. భూకక్ష్యలో వ్యోమగాములు ఉండేందుకు ఇది ఓ ఇల్లులా ఉపకరిస్తోంది. మొత్తం 14 దేశాలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
Similar News
News February 16, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 16, 2026
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.
News February 16, 2026
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.


