News September 30, 2024

పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <>వెబ్‌సైట్<<>> ద్వారా అప్లై చేయాలి. సర్టిఫికెట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో ఇస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఇవి సాయపడతాయి.

Similar News

News September 30, 2024

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

image

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.

News September 30, 2024

Stock Market: నష్టాల్లో నడుస్తున్నాయ్

image

అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, TCS, ICICI గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. సెన్సెక్స్ ప్ర‌స్తుతం 500 పాయింట్ల న‌ష్ట‌ంతో 85,060 వ‌ద్ద‌, నిఫ్టీ 150 పాయింట్ల న‌ష్టంతో 26,030 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవ‌ల చైనా Central Bank వ‌డ్డీ రేట్ల కోత‌తో FIIల మనీ ఫ్లో ఆ దేశ మార్కెట్లలో అధికంగా ఉండడం కూడా మన మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

News September 30, 2024

రోడ్లు వేయడానికి నిధులు లేవా రేవంత్: KTR

image

TG: రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మాజీ సర్పంచుల సంగతి సరే. చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు అవుతున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అటకెక్కించారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా’ అని ట్వీట్ చేశారు.