News September 30, 2024
ఆర్థిక సంక్షోభం.. పాక్‌లో 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.
Similar News
News February 23, 2026
ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు/సిరీస్‌లు ఇవే

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 25 నుంచి ప్రియాంకా చోప్రా నటించిన ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది బ్లఫ్’ స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంద్ర చివరి సినిమా ‘ఇక్కిస్’ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 26 నుంచి లియోనార్డో డికాప్రియో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’, 27 నుంచి సన్ NXTలో నవీన్ చంద్ర ‘హనీ’ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
News February 23, 2026
ట్రంప్ టారిఫ్‌ల వసూళ్లు రేపటి నుంచి బంద్

US అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూఎస్ కస్టమ్స్& బోర్డర్ ప్రొటక్షన్ చర్యలు ప్రారంభించింది. IEEPA(ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) ప్రకారం ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను రేపటి నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దిగుమతిదారులకు సమాచారం అందించామంది. ఇప్పటి వరకు చెల్లించిన టారిఫ్‌లు రిఫండ్ చేస్తారా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.
News February 23, 2026
అష్టలక్ష్మి: సంతానలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

సంతానలక్ష్మి దేవికి పచ్చని వస్త్రాలు, పూలను సమర్పించి ఆరాధించాలి. పచ్చ రంగు వంశాభివృద్ధికి, చిగురించడానికి సంకేతం. ఓ మొక్క ఎలాగైతే పచ్చగా ఉండి కొత్త కొమ్మలను ఇస్తుందో అలాగే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానాన్ని ఈ దేవి ప్రసాదిస్తుంది. పచ్చని పుష్పాలతో పూజిస్తే సంతాన దోషాలు పోతాయని నమ్మకం. అలాగే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా, బుద్ధిమంతులుగా పెరుగుతారని పండితులు చెబుతున్నారు.


