News September 30, 2024

ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

Similar News

News January 29, 2026

173 ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 29, 2026

గర్భ నిరోధక ఇంజెక్షన్

image

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దీన్ని డీఎంపీఏ ఇంజెక్షన్ (డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్) వాడతారు. ఇందులో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. ఆ తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు.

News January 29, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/