News September 30, 2024

బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది!

image

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్‌లు జంటగా నటించారు.

Similar News

News September 30, 2024

మా ప్రాణాలు తీశాకే ‘హైడ్రా’ కూల్చివేతలకు వెళ్లాలి: బండి సంజయ్

image

TG: అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరదీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చాలనుకుంటే హైడ్రాను బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తమ ప్రాణాలు తీశాకే కూల్చివేతలకు వెళ్లాలన్నారు. ఈ అంశంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు.

News September 30, 2024

దేవర సునామీ.. 3 రోజుల్లో రూ.304 కోట్లు

image

జూ.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. మరో వారంలో రూ.500 కోట్ల మార్క్‌కు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మారథే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News September 30, 2024

శని, ఆదివారాలు ఎందుకు కూల్చుతున్నారు?: హైకోర్టు

image

TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. శని, ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది. పొలిటికల్ బాస్‌లను, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది. కాగా అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు.