News September 30, 2024

నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో

image

AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

Similar News

News September 30, 2024

DSC ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ-2024 ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. https://tgdsc.aptonline.in/tgdsc/ ఇందులో 6508 ఎస్జీటీ, 2629 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేటర్స్), 727 లాంగ్వేజ్ పండిట్, 220 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి.

News September 30, 2024

GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.

News September 30, 2024

గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!

image

ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్‌లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.