News September 30, 2024

రోడ్లు వేయడానికి నిధులు లేవా రేవంత్: KTR

image

TG: రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మాజీ సర్పంచుల సంగతి సరే. చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు అవుతున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అటకెక్కించారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 16, 2026

ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

image

అధికారికంగా కాకపోయినా ట్రంప్‌ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.

News January 16, 2026

ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

image

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

News January 16, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) 62 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా అప్రెంటిస్‌లు JAN 28న, డిగ్రీ (BCom,BSc/BCA)ఉత్తీర్ణులు JAN 29న, బీఈ/బీటెక్ అర్హతగల వారు JAN 30న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in