News September 30, 2024

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

image

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.

Similar News

News September 30, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ సెన్సార్ క‌ట్‌కు అంగీక‌రించిన కంగ‌న‌

image

నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌నున్నాయి. ఈ చిత్రం విడుద‌ల‌కు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయ‌డానికి కంగ‌న అంగీక‌రించిన‌ట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పుల‌ను చిత్రంలో స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చిత్రం కో-ప్రొడ్యూస‌ర్ జీ స్టూడియోస్ కొంత స‌మ‌యం కోర‌డంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.

News September 30, 2024

సీఎం, TTD ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలి: సుప్రీం

image

AP: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? SEP 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు. ఆ నెయ్యి వాడలేదని TTD చెబుతోంది’ అని సుప్రీం తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని GOVT తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు.

News September 30, 2024

$200 బిలియన్ల క్లబ్‌లో జుకర్‌బర్గ్

image

Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా $200 బిలియన్ల నిక‌ర సంప‌ద క‌లిగిన వారి క్లబ్‌లో చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మార్క్ జుకర్‌బర్గ్ నికర సంప‌ద‌ విలువ $201 బిలియన్లకు చేరుకుంది. టెస్లా CEO ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, LVMH ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాత జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంప‌ద క‌లిగిన నాలుగ‌వ వ్య‌క్తిగా నిలిచారు.