News September 30, 2024

నటుడి ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లు

image

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో కేటుగాళ్లు నకిలీ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు. దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. నిందితులు ఈ ఫేక్ నోట్లతో 2,100 గ్రా. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా విషయం బయటకు వచ్చింది. నలుగురిని అరెస్టు చేసి, రూ.1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు.

Similar News

News September 30, 2024

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

image

TG: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకున్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

News September 30, 2024

VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్

image

ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్‌ డిన్నర్‌కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ సెన్సార్ క‌ట్‌కు అంగీక‌రించిన కంగ‌న‌

image

నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌నున్నాయి. ఈ చిత్రం విడుద‌ల‌కు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయ‌డానికి కంగ‌న అంగీక‌రించిన‌ట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పుల‌ను చిత్రంలో స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చిత్రం కో-ప్రొడ్యూస‌ర్ జీ స్టూడియోస్ కొంత స‌మ‌యం కోర‌డంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.