News September 30, 2024

మా ప్రాణాలు తీశాకే ‘హైడ్రా’ కూల్చివేతలకు వెళ్లాలి: బండి సంజయ్

image

TG: అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరదీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చాలనుకుంటే హైడ్రాను బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తమ ప్రాణాలు తీశాకే కూల్చివేతలకు వెళ్లాలన్నారు. ఈ అంశంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు.

Similar News

News September 30, 2024

సత్యమేవ జయతే: YCP

image

AP: తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు లేవని, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది.

News September 30, 2024

లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్‌లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది.

News September 30, 2024

చాలా ప్రాంతాల్లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ పూర్తి!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ మార్క్‌ను చేరుకున్నట్లు తెలిపాయి. మాస్ ఏరియాల్లో ముఖ్యంగా సి సెంటర్లలో దేవర రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోందని వెల్లడించాయి.