News September 30, 2024

దసరాకు 758 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.

Similar News

News March 5, 2026

కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

image

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

News March 5, 2026

కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News March 5, 2026

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శానిటేషన్‌లో మెరుగుపడితే అవార్డులు వస్తాయని సూచించారు.