News September 30, 2024

233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

image

కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినల్ హక్(107*) మినహా అందరు బ్యాటర్లు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు కొద్ది సేపు మ్యాచ్ జరగగా, రెండున్నర రోజులు వర్షార్పణమైన విషయం తెలిసిందే. మరో ఒకటిన్నర రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.

Similar News

News September 30, 2024

ప్రభుత్వానికి లేఖ రాయనున్న ‘అప్సా’

image

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) రద్దు అంశాన్ని పున:పరిశీలించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇటీవల అప్సా గుర్తింపు రద్దుపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ప్రస్తుతం అప్సా రద్దు ఫైల్ సీఎం వద్దకు చేరగా, రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News September 30, 2024

మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్

image

TG: మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘అక్కడి నివాసితులను హైడ్రా తరలించట్లేదు. కూల్చివేతలు చేపట్టడం లేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే. TGలో ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’ అని రంగనాథ్ ఆక్షేపించారు.

News September 30, 2024

సుప్రీం సూచన చెంపపెట్టు: షర్మిల

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప పెట్టులాంటిదని APCC చీఫ్ షర్మిల అన్నారు. మత రాజకీయాలు కాకుండా హిందువుల మనోభావాలే ముఖ్యమనుకుంటే కూటమి ప్రభుత్వం SC సూచనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును CBIకి అప్పగిస్తేనే ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. కల్తీ ఎలా జరిగింది? నిందితులెవరనేది తేల్చాలన్నారు.