News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

AP: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Similar News
News January 14, 2026
ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
News January 14, 2026
గంజితో ఎన్నో లాభాలు

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
News January 14, 2026
ముగ్గుల్లో వైద్య, కంప్యూటర్ శాస్త్రాల మేళవింపు

ముగ్గులలో వైద్యశాస్త్ర సంకేతాలు ఉన్నాయట. కిందికి, పైకి ఉండే త్రిభుజాలు స్త్రీ, పురుష తత్వాలను సూచిస్తాయట. వీటి కలయికతో ఏర్పడే 6 కోణాల నక్షత్రం సృష్టికి సంకేతం. ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆల్గారిథమ్స్ రూపొందించడానికి, క్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి కూడా ముగ్గులు తోడ్పడుతున్నాయట. గణితం, మానవ శాస్త్రం కలగలిసిన అద్భుత కళాఖండం ఈ రంగవల్లిక. ఇది మన సంస్కృతిలోని విజ్ఞానానికి నిదర్శనం.


