News September 30, 2024

సత్యమేవ జయతే: YCP

image

AP: తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు లేవని, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది.

Similar News

News November 7, 2025

తండ్రులకూ డిప్రెషన్.. వారికీ చేయూత కావాలి!

image

బిడ్డ పుట్టాక తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం వంటివి వస్తాయి. ఇప్పుడు బిడ్డను చూసుకునే బాధ్యత తండ్రికీ ఉంటోంది. రాత్రులు నిద్రలేకపోవడం, బాధ్యతలు, ఖర్చులు, ఒత్తిడి, జాబ్ కారణంగా తండ్రుల్లోనూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తండ్రికీ కుటుంబం నుంచి చేయూత అవసరం అంటున్నారు.

News November 7, 2025

అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

image

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌‍లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.

News November 7, 2025

Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

image

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్‌కు సంబంధించిన వంటి టికెట్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.