News September 30, 2024
లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ నటుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆయనపై వేధింపుల ఆరోపణలు రావడంతో కేరళ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయనకు ఉపశమనం కలిగింది.
Similar News
News February 1, 2026
రాత్రిపూట చికెన్ తింటున్నారా?

సండే అంటేనే చాలామంది చికెన్ తిని చిల్ అవుతుంటారు. రాత్రి వేళ తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడం, నిద్ర పోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. నాన్‌వెజ్ జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి నిద్రకు 3Hrs ముందే భోజనం ముగించాలంటున్నారు. తిన్న వెంటనే పడుకోకుండా నడవాలని, హాట్ వాటర్, పుదీనా టీ తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే అజీర్తి, గుండెలో మంట వంటి సమస్యలు రావని చెబుతున్నారు.
News February 1, 2026
బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్.. ‘ఆశ-నిరాశ’!

బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం మిశ్రమంగా స్పందించింది. మెట్రో, హైవే, రైల్వేల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టుల వల్ల టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు. కానీ అఫర్డబుల్ హౌసింగ్‌కు ఇన్సెంటివ్స్ లేకపోవడంపై CREDAI పెదవి విరిచింది. ఖర్చులు పెరిగి కొత్త ఇళ్ల నిర్మాణాలు పడిపోతాయని హెచ్చరించింది. ఇన్ఫ్రా వల్ల కొత్త ఏరియాలు డెవలప్ అయినా సామాన్యుడికి సొంతింటి కల దూరమవుతుందని పేర్కొంది.
News February 1, 2026
‘సింగరేణి’ పై కమిటీ నివేదిక అందింది: కిషన్ రెడ్డి

TG: సింగరేణి కాలరీస్ కంపెనీ వ్యవహారాలపై అధికారుల కమిటీ నివేదిక అందిందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹51000 CR సంస్థకు బకాయి పడిందని చెప్పారు. కాగా నైనీ బొగ్గు గనుల టెండర్లు, CSR నిధులపై వివాదం నెలకొనడం తెలిసిందే.


