News September 30, 2024

మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ సర్వే

image

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సెస్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో దీనిని చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు, స్కిల్ డెవలెప్‌మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది సర్వే చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు.

Similar News

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

News November 10, 2025

న్యూస్ రౌండప్

image

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News November 10, 2025

జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

image

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.