News September 30, 2024
పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదు: లోకేశ్

AP: స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సాల్డ్ ప్రాజెక్టు ద్వారా HMలు, SGTలకు సమగ్ర శిక్షణ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని, పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.
News January 9, 2026
ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.


