News September 30, 2024
ఈ ఊరిలో కుటుంబంలో ఒకరిగా నాగుపాములు!

మహారాష్ట్రలోని షోలాపూర్(D) షెట్పాల్ గ్రామంలో నాగుపాములు కుటుంబసభ్యుల్లా ఇంట్లోనే తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటుండగా పిల్లలు వాటితో ఆడుకుంటారు. సర్పాలను శివుడి ప్రతిరూపాల్లా భావిస్తూ ఇంట్లో అవి ఉండే ప్రాంతాన్ని దేవాలయంగా పరిగణిస్తుంటారు. ఇప్పటివరకు ఈ విషసర్పాలు కాటేసిన ఘటనలు గ్రామంలో వినిపించలేదు. పాము-మనుషుల మధ్య ఉన్న బంధాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.
Similar News
News January 31, 2026
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

<
News January 31, 2026
సిట్ విచారణకు కేసీఆర్?

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.
News January 31, 2026
28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/


