News October 1, 2024

HEADLINES

image

* తిరుమల లడ్డూలో కల్తీపై ఆధారాలున్నాయా? ప్రభుత్వానికి SC ప్రశ్న
* కల్తీపై ఆధారాలు లేకుండా పబ్లిక్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశారు?: SC
* లడ్డూ వ్యవహారం: సత్యమేవ జయతే అంటూ YCP ట్వీట్
* హైడ్రా ఇలాగే వ్యవహరిస్తే స్టే ఇస్తాం: హైకోర్టు
* తెలంగాణ DSC ఫలితాలు విడుదల
* రేవంత్ అన్‌ఫిట్ సీఎం: KTR
* KTR నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు: మంత్రి సురేఖ

Similar News

News October 1, 2024

ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య

image

ముడా స్కామ్‌కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.

News October 1, 2024

కొనసాగుతున్న బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’

image

TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటల దీక్ష చేస్తున్నారు. ‘అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.

News October 1, 2024

వరద బాధితుల ఖాతాల్లో రూ.588కోట్లు జమ

image

AP: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం ₹602కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ₹588కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు CMకి తెలిపారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, వివరాలు సరిగా లేకపోవడంతో కొందరి అకౌంట్లలో నగదు జమ కాలేదని, బ్యాంక్‌కు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించామన్నారు.