News October 1, 2024
రైతుల రుణాలను మాఫీ చేయాలి: ఎంపీ నగేశ్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చి రైతులకు న్యాయం చేయలేదని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ కాని రైతుల రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 6, 2024
నర్సాపూర్ (జి): సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య
సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ (జి) మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమాన్లు వివరాలు.. నిజామాబాద్ జిల్లా రాంనగర్‌కు చెందిన దినేష్ (22) తన భార్య బంధువులు బుర్గుపల్లికి వచ్చారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్తునానని బైక్‌పై వెళ్లి గ్రామ సమీపంలోని సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.
News November 5, 2024
ఆదిలాబాద్: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
News November 5, 2024
నిర్మల్: బేస్ బాల్ ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఉదయం బేస్ బాల్ ఆడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న అయాన్(14) అనే విద్యార్థి వాలీబాల్ ఆడుతూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బాలుడి స్వగ్రామం దిలావర్పూర్ మండలం లోలం గ్రామం. ఫిట్స్ రావడంతోనే బాలుడు చనిపోయినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.