News October 1, 2024

రక్తమోడిన రోడ్లు.. ఏడుగురి మృతి

image

TG: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద NH-44పై అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

Similar News

News October 1, 2024

నేరాలకు పాల్పడే వారిని వదలొద్దు: సీఎం

image

AP: నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజకీయ ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి కేసులపై అధికారులతో చర్చించారు. పోలీసుల పని తీరులో మార్పు కనిపించాలని, చిన్న భూకబ్జా జరిగినా బాధ్యులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పినట్లు సమాచారం.

News October 1, 2024

నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన రావడం ఇదే తొలిసారి.

News October 1, 2024

ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య

image

ముడా స్కామ్‌కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.