News October 1, 2024

నిసాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. వచ్చేది ఎప్పుడంటే..

image

కార్ల తయారీ రంగంలో కాంపాక్ట్ SUV మాగ్నైట్‌తో నిసాన్ భారత మార్కెట్‌లో కొంతమేర భాగస్వామ్యం దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబరు 4న తీసుకొస్తోంది. ప్రీలాంఛ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయినట్లు సంస్థ ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్, బ్రెజా, రెనాల్ట్ కైగర్, కియా సొనెట్ కార్లకు ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ.6లక్షలు ఉండొచ్చని అంచనా.

Similar News

News October 1, 2024

APPSC ఛైర్‌పర్సన్‌గా అనురాధ?

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో 3 నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు ఫైల్ చేరినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఏపీ తొలి నిఘా చీఫ్‌గా ఆమె పనిచేశారు. తర్వాత పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి గతేడాది పదవీ విరమణ చేశారు.

News October 1, 2024

DSC: నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డీఎస్సీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ తీసుకుని, వాటి ఆధారంగా పోస్టింగ్స్ ఇస్తారు.

News October 1, 2024

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఎంతంటే?

image

TG: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా ఈ ఏడాది ₹93,750 చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ వర్తించనుంది. గత ఏడాది ₹85,500 చెల్లించగా, ఈసారి అదనంగా ₹8,250 ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డబ్బులు ఈనెల 7న కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.