News October 1, 2024

US వీసా కోసం వెయిట్ చేస్తున్నవారికి గుడ్‌న్యూస్

image

US వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నవారికి ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటీ గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్ కేటాయించినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షలకు పైగా ఇండియన్స్ US వెళ్లారు. అమెరికా గణాంకాల ప్రకారం.. 2023 అక్టోబరు నుంచి ఏడాది కాలంలో 6 లక్షల స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేయగా వాటిలో ప్రతి నాలుగింటిలో ఒకటి భారత విద్యార్థిదే కావడం గమనార్హం.

Similar News

News October 1, 2024

తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?

image

TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్‌సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్‌రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్‌రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

News October 1, 2024

YELLOW ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. <<14239007>>APలో ఈ జిల్లాల్లో వర్షాలు.<<>>

News October 1, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.