News October 1, 2024
గ్రాండ్‌గా ‘దేవర’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్?

Jr.NTR నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా డిసైడ్ కాలేదని సినీవర్గాలు తెలిపాయి. ఫ్యాన్స్ భారీగా రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సక్సెస్ ఈవెంట్‌ను ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.
Similar News
News February 1, 2026
KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.
News February 1, 2026
సెమీస్‌కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

U19 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్‌రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్‌తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్‌తో సెమీఫైనల్‌లో తలపడనుంది.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్‌పై ఆదేశాలు ఇవ్వలేదు: KCR

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తాను ఆదేశాలు ఇవ్వలేదని KCR సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై GOVTకి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది. MLAల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అదెలా సేకరించారో CMకు అవసరం లేదు కదా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది.


