News October 1, 2024
గుంటూరు జిల్లాలో జూ.NTR ‘దేవర’ సక్సెస్ మీట్.?

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత నెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వాహకులు స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా.. చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.
Similar News
News February 28, 2026
కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
News February 28, 2026
కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.
News February 28, 2026
మినుము, పెసల కొనుగోలుకు సర్వం సిద్ధం: కృష్ణా జిల్లా జేసీ

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ శుక్రవారం ప్రకటించారు. క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ. 8,768 మద్దతు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారానే విక్రయాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


