News October 1, 2024

YELLOW ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. <<14239007>>APలో ఈ జిల్లాల్లో వర్షాలు.<<>>

Similar News

News January 26, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 26, 2026

టీ20 వరల్డ్‌కప్‌ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

image

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

News January 26, 2026

కొత్త మూవీ.. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ

image

మాస్ మహారాజా రవితేజ రూటు మార్చారు. అయ్యప్పస్వామి భక్తుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. రవితేజ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్‌ను ‘ఇరుముడి’గా పేర్కొంటూ మేకర్స్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ‘ప్రతి ఎమోషన్ ఒక సెలబ్రేషన్’ అని పేర్కొన్నారు. తలపై ఇరుముడితో చిన్నారిని ఎత్తుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.