News October 1, 2024

పాల సేకరణలో గణేశ్వర పురానికి జిల్లాలో ప్రథమ స్థానం

image

వరికుంటపాడు మండలంలోని గణేశ్వర పురం గ్రామానికి పాల సేకరణలో జిల్లాలో ప్రథమ స్థానం లభించింది. నెల్లూరులో జరిగిన పాల సొసైటీ సర్వసభ్య సమావేశంలో గ్రామానికి చెందిన పాల సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ బాదం వెంకట్ నారాయణరెడ్డిను విజయ డైరీ ఛైర్మన్ కొండ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఛైర్మన్ సుధీర్ రెడ్డి అభినందించారు. ఆయన ఈ ఏడాది మొత్తం మీద 1,86,572 లీటర్లు పాలు సేకరించారు.

Similar News

News November 7, 2025

ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.

News November 7, 2025

వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

image

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?