News October 1, 2024

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లకు షాక్!

image

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రాబడి తగ్గిపోవచ్చు. OCT 1 నుంచి మారిన పాలసీ సరెండర్ రూల్సే ఇందుకు కారణం. ఇప్పట్నుంచి ఒక ప్రీమియం చెల్లించినా మొదటి ఏడాది నుంచే గ్యారంటీగా సరెండర్ వాల్యూను పొందొచ్చు. దీంతో ఎక్కువ కాలం హోల్డ్ చేసే పాలసీలపై రిటర్న్స్ 30-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గొచ్చని విశ్లేషకులు అంటున్నారు. బోనస్‌లోనూ కోత పడనుంది. నాన్ పార్టిసిపేటరీ పాలసీలపై మార్పు ప్రభావం వెంటనే ఉండనుంది.

Similar News

News October 1, 2024

ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT

News October 1, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖలో కేంద్రాలు సిద్ధం చేసి నిపుణులతో తరగతులు చెప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపినవారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేయనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు సమాచారం.

News October 1, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేంద్రం ఏం చేయబోతోంది?

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ విచారణను కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అనే దానిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి నివేదిక సైతం దానికి అనుకూలంగానే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.