News October 1, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Similar News

News January 23, 2026

పోలీసుల నిఘాలో చెరువుగట్టు

image

చెరువుగట్టు జాతరలో భక్తుల రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ వ్యూహాన్ని రచించింది. వెయ్యి మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అత్యాధునిక ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతతో పాత నేరస్థులపై నిఘా ఉంచడంతో పాటు, క్యూలైన్లు, పార్కింగ్ వద్ద ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ-టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.

News January 23, 2026

దేవరకొండ: మహిళా లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

దేవరకొండలోని ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగానికి పార్ట్ టైం (Hourly Basis) పద్ధతిలో మహిళా లెక్చరర్ నియామకానికి అర్హత గల మహిళా అభ్యర్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ తెలిపారు. ఈ నెల 27 లోపు తమ దరఖాస్తు పత్రాలను సమర్పించలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. వివరాలకు సెల్: 9908330585 సంప్రదించాలన్నారు.

News January 23, 2026

చెరువుగట్టు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్, ఎస్పీ

image

నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ శివరాంరెడ్డి పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న భద్రతపై, సౌకర్యాలపై దేవాదాయ అధికారులను కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటు లేకుండా ఉత్సవాలు జరిపించాలని ఆదేశించారు.