News October 1, 2024

కూతురుకు పెళ్లి చేసిన సద్గురు ఇతరులకెందుకు సన్యాసం ఇస్తున్నారు: కోర్టు

image

కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్ ఇతర యువతుల్ని సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తన ఇద్దరు కుమార్తెలను బ్రెయిన్‌వాష్ చేసి ఇషా సెంటర్లో పర్మనెంట్‌గా ఉంచారని Rtd. ప్రొఫెసర్ కామరాజు వేసిన HCP పిటిషన్‌ను సోమవారం విచారించింది. ఆధ్యాత్మిక జీవితంలో ఎవర్నీ ద్వేషించొద్దన్న వైఖరి పేరెంట్స్‌పై ఎందుకు కనిపించడం లేదని ఆ కుమార్తెలను ప్రశ్నించింది.

Similar News

News September 15, 2025

బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

image

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.

News September 15, 2025

వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

News September 15, 2025

యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

image

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్‌(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం