News October 1, 2024

నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

image

బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరుతూ తన లైసెన్స్‌డ్ గన్‌ను బాక్సులో పెడుతుండగా కిందపడింది. అది పొరపాటున పేలడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News March 13, 2025

KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

image

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

image

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

News March 13, 2025

నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

image

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

error: Content is protected !!