News October 1, 2024

తిరుపతిలో పవన్ సభ ఎలా పెడతారు: MP గురుమూర్తి

image

సుప్రీంకోర్టులో లడ్డూ అంశం పెండింగ్‌లో ఉన్నప్పుడు తిరుపతిలో DY CM పవన్ బహిరంగ సభ నిర్వహించడం సరికాదని ఎంపీ గురుమూర్తి ట్వీట్ చేశారు. ‘పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా చేయకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడింది. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ముందే నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 12, 2024

మహిళల టీ20 WC.. భారత్ సెమీస్ చేరాలంటే?

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌‌రేట్‌తో భారత్ సెమీస్ చేరుతుంది.

News October 12, 2024

చెర్రీ, బాలయ్య సినిమాల నుంచి అప్‌డేట్స్

image

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు విజయ దశమి రోజున అప్‌డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్‌తో చరణ్ పిక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలక‌ృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్‌ను వదలనున్నట్లు తెలిపింది.

News October 12, 2024

అప్పుడు నారాయణ మూర్తి ఆహ్వానంపై ర‌తన్ టాటా ఏమన్నారంటే?

image

రతన్ టాటాతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను నారాయణ మూర్తి ఇటీవల గుర్తు చేసుకున్నారు. Infosysలో జంషెడ్‌జీ టాటా హాల్ ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తే ‘TCS మీ ప్ర‌త్య‌ర్థి. న‌న్నెందుకు ఆహ్వానిస్తున్నారు’ అని టాటా వ్యాఖ్యానించారట. దీనికి బ‌దులిస్తూ ‘జంషెడ్‌జీ సంస్థ‌ల స్వ‌రూపాన్నే మార్చిన వ్య‌క్తి. ఆయ‌న్ను మాతో పోటీదారుగా ప‌రిగ‌ణించం. ఇది ఆయ‌న్ను గౌర‌వించుకొనే విష‌యం’ అని చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు.