News October 1, 2024
NZB: GREAT.. అప్పుడు సర్పంచ్‌గా.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా..!
చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013) నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపిక కానున్నాడు.
Similar News
News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. అదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
News February 4, 2025
NZB: జిల్లా వాసికి సిల్వర్ మోడల్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్టేట్ మీట్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ నీతా రెడ్డిని ఖైరతాబాద్ సీఐడీ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నీతా రెడ్డి హైదరాబాదులోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్ సాధించడంతో ఆమెను ప్రశంసించారు.
News February 4, 2025
NZB: త్రిపుర గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం
సీసీఆర్‌టీ ట్రైనింగ్‌లో భాగంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని తెలియజేస్తున్న సీసీఆర్టీ బృందాన్ని గవర్నర్ సన్మానించారు. ఈ బృందంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు కలే గోపాల్, ప్రసన్న మాలిగిరెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.